బీవోబీలో అక్రమాలపై ముమ్మర విచారణ

7 Sep, 2021 03:44 IST|Sakshi

కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో వెలుగుచూసిన అక్రమాలపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం విచారణకు బీవోబీ రీజినల్‌ మేనేజర్‌ ఎం.వి.శేషగిరి, ఉద్యోగులు కె.జయకృష్ణ, ఈశ్వరన్, అబీదా ముబీన్, మహమ్మద్‌ షరీఫ్, రామచంద్రుడు, సి.ఈలు, తేజసాయి, సి.రాము, ఇన్‌చార్జ్‌ మేనేజరు రామసుబ్బారెడ్డి తదితరులు హాజరయ్యారు. బదిలీపై వెళ్లిన మేనేజర్‌ మద్దిలేటి వెంకట్‌ గైర్హాజయ్యారు. ఉదయం నుంచి వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి ఉద్యోగులను విచారించారు.

డ్వాక్రా గ్రూపులకు సంబంధించి నకిలీ ఖాతాలు సృష్టించి రూ.కోటి వరకు నగదు తీసుకుని మెసెంజర్‌తోపాటు కొందరు ఉద్యోగులు పంచుకున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. కాగా, అక్రమ లావాదేవీలతో తమకు సంబంధం లేదని, తమ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లతో మెసెంజర్‌ అలీఖాన్‌ ఇదంతా చేశారని విచారణకు హాజరైన ఉద్యోగులు తెలిపారు. మెసెంజర్‌ అలీఖాన్‌ ఉద్యోగులందరికీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేయించి ఇచ్చేలా మేనేజర్లే సూచించారని చెప్పారు. దీంతో అందరి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు ఉపయోగించి అక్రమ నగదు లావాదేవీలు చేశారని పోలీసులకు వివరించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు