డబ్బులు ఇవ్వకుంటే నీపై కేసు పెడతాం.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇవ్వకుంటే నీపై కేసు పెడతాం.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

Published Thu, Jan 27 2022 9:24 PM

 Man Ends Life For Fake Case Lodged By Police Tamil Nadu Video Goes Viral - Sakshi

తిరువొత్తియూరు: అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు తనను అన్యాయంగా బెదిరిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మదురై బీపీ కులం ఇందిరా నగర్‌కు ఈశ్వరన్‌ (30). ఇతను గత 18వ తేదీ రాత్రి తల్లాకులం అవుట్‌పోస్టు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిప్పు అంటించుకున్నాడు. ఇది చూసిన అక్కడ భద్రతలో వున్న పోలీసులు అతడిని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

పోలీసులు అబద్దపు కేసు నమోదు చేసి ఓ తెల్లకాగితంలో సంతకం తీసుకోవడంతో ఈశ్వరన్‌పై  నిప్పు అంటించుకున్నట్లు అతని బంధువులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరన్‌ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో తల్లకులం పోలీసులు తరచూ అబద్దపు కేసు నమోదు చేసి అరెస్టు చేసి తనకు నగదు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. లేకుంటే తనపై గంజా, మద్యం విక్రయం తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని బెదిరించారని వాపోయాడు. దీనివల్లే నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు ప్రయతి్నంచానని తెలిపాడు. ఈవీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ క్రమంలో మదురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరన్‌ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఈశ్వరన్‌ సోదరి శివగామి బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు.  

Advertisement
Advertisement