బస్సు దూసుకొచ్చి వ్యాపారి మృతి

12 Apr, 2021 17:03 IST|Sakshi

తుమకూరు: సరుకుల కోసం వెళ్తున్న వ్యాపారిని ప్రైవేటు బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. వివరాలు.. శిరా తాలూకా హారోగెరె గ్రామానికి చెందిన సి.మంజునాథ్‌(35) గ్రామంలో దుకాణం నిర్వహిస్తున్నాడు. సరుకుల కోసం ఆదివారం శిరాకు బైక్‌లో వెళ్తుండగా బరగూరు హారోగెరె సర్కిల్‌ వద్ద ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బైక్‌ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన మంజునాథ్‌ను శిరా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడని పట్టనాయకనహళ్లి పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

చీరల వ్యాపారి మృతి
బళ్లారి అర్బన్‌: తాలూకాలోని పీడీహళ్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు(26) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్‌ఐ శశిధర్‌ ఆదివారం తెలిపారు. అనంతపురానికి చెందిన మధు చీరల వ్యాపారం చేస్తూ బళ్లారి నుంచి చీరలను బైక్‌పై తీసుకెళుతుండగా జోళదరాశి సమీపంలోని మారెమ్మ గుడి దగ్గర అదుపు తప్పి కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని విమ్స్‌ మార్చురీకి తరలించారు.  ఈ ఘటనపై హగరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: వివాహేతర సంబంధం: ప్రియురాలికి నిప్పంటించి..
అవ్వ ఇంటికి వచ్చి అంతమయ్యాడు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు