మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య, శరణ్యను కిరాతకంగా..

10 Aug, 2023 21:05 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ మహిళను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి..  రాళ్లతో  కొట్టి చంపారు. రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే ఈ హత్య జరిగింది.  

మృతురాలిని గోపాలవాడకు చెందిన శరణ్యగా గుర్తించారు పోలీసులు. ఆమె ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఆమెపై ఘాతుకం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌ పక్కనే ఆమె మృతదేహాం పడి ఉంది. సమాచారం అందుకున్న డీసీపీ సుధీర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

ఇదిలా ఉంటే శరణ్య భర్త సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే.. వాళ్ల ఇద్దరి మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ ఆ కోణం నుంచే మొదలైంది. 

మరిన్ని వార్తలు