మైనర్‌పై సామూహిక అత్యాచారం.. 12 గంటలపాటు నిర్బంధించి..

18 Dec, 2022 16:19 IST|Sakshi

మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కామాంధులు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలే కాకుండా పసిపిలల్లపై సైతం లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో సభ్య సమాజం లదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై కొంతమంది యువకులు సామూహిక అ‍త్యాచారానికి పాల్పడ్డారు. 12 గంటలపాటు బాలికను నిర్భంధించి అత్యంత దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టారు.

పాల్ఘర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. పాల్ఘర్‌ జిల్లా రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై 8 మంది వ్యక్తులు అత్యాచారం చేశారు. డిసెంబర్‌ 16న(శుక్రవారం) కొందరు వ్యక్తులు బాలికను కిడ్నాప్‌ చేసి మహిమ్‌ గ్రామంలోని ఖాళీగా ఉన్న బంగ్లాలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేగాక అక్కడి నుంచి సముద్ర తీరానికి తీసుకెళ్లి అక్కడి పొదల్లో మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు.

మొత్తం 12 గంటలపాటు (శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు) బాలికను నిర్బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఎలాగోలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు సత్పతి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
చదవండి: అమానుష ఘటన.. అపార్ట్‌మెంట్‌ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు

మరిన్ని వార్తలు