విశాఖ ప్రేమోన్మాది ఘటన: చికిత్స పొందుతూ యువకుడి మృతి

16 Nov, 2021 10:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని లాడ్జీలో యువతిపై పెట్రోల్‌తో దాడిచేసి, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హర్షవర్ధన్‌  కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. కాగా, ఈ నెల 13న యువతిని మాట్లాడుకుందామని స్థానిక.. శ్రీ రాఘవేంద్ర లాడ్జికి పిలిచాడు. ఈ క్రమంలో.. ఆమెపై హర్షవర్ధన్‌ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.  బాధితులిద్దరిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు ఈనెల 13న యువతిని లాడ్జికి రమ్మన్నాడు. వారి మధ్య గొడవకు ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు