ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?

16 Oct, 2020 12:33 IST|Sakshi

అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు పట్టుబడగా.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య!

నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్‌ డెత్‌గా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైలు సిబ్బందిని విచారించారు. చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు నాగరాజును విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విషయాల్లో దర్యాప్తు సాగుతోంది. చదండి: కీసర నాగరాజా మజాకా! 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు