మాదాపూర్‌: ఓయో రూంలో వ్యభిచారం చేస్తూ..

25 May, 2022 11:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాదాపూర్‌(హైదరాబాద్‌): వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఎన్‌ కన్వెన్‌షన్‌ వద్ద ఉన్న  హైటెక్‌ టవర్‌ హోటల్‌ 4వ ఫ్లోర్‌  గది నంబర్‌ 401లో ఇద్దరు వ్యక్తుల సాయంతో దాడి చేశారు.
చదవండి: ర్యాపిడో డ్రైవర్‌ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు

అందులో ఓ మహిళ ఇతరులతో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బిహార్‌కు చెందిన అజిత్‌భగత్‌(25), ఓ కంపెనీలో హౌస్‌కీపింగ్‌ పనిచేస్తున్నాడు. అమీన్‌పూర్‌ బీరంగూడకు చెందిన పట్లోళ్ల రాహూల్‌రెడ్డి (24), ప్రైవేటు ఉద్యోగి. పశ్చిమ బెంగాల్‌కి చెందిన నున్నిహర్‌ ఖాతున్‌ ఫలెజ్‌ అలీ(34)కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వీరితో కలసి అర్జున్‌ అలియాస్‌ కమలాకర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి పలువురిని పిలిపించుకుని అజిత్‌ భగవత్‌ సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఈ సంఘటనలో అర్జున్‌ పరారీలో ఉండగా పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.  సోదాలో  రూ.1010 నగదు, తదితర సామగ్రితో పాటు రెండు సెల్‌పోన్లు, స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు 

మరిన్ని వార్తలు