HYD: ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

HYD: ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌

Published Wed, Mar 27 2024 5:55 PM

Police Speed Up Investigation In Praneeth Rao Phone Tapping Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్‌ఐబీ కీలుబొమ్మగా మారింది. అధికారులు ఎస్ఐబి  కంట్రోల్ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ డీఐజీ నేతృత్యంలో ఎస్‌ఐబీ నడిచింది. ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీల కంట్రోల్‌లో ఎస్‌ఐబీ నడిచింది. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

రిటైర్డ్ అయిన తర్వాత కూడా ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డిఎస్పీలు అక్కడే  తిష్ట వేశారు. ప్రణీత రావు నేతృత్వంలో  మాజీ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ప్రణీతరావుకి పూర్తిగా ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు గుర్తించారు. ఎస్ఐబిలో మొత్తం 38 మంది సిబ్బందితో ప్రణీత్‌రావు లాగర్ రూమ్ నడిపారు.

ప్రభాకర్ రావు ఆదేశాలతో పలువురి నంబర్లను ట్రాప్ చేసిన మాజీలు.. రిటైర్డ్ అయిన అధికారులు ఓఎస్డీ పేరుతో ఎస్ఐబీలో చలామణి అయ్యారు. సర్వీస్‌లో ఉన్న అధికారుల పేర్లతో ఓఎస్డీలు అక్రమాలను సిట్‌ గుర్తించింది. ప్రణీత్ రావుకి సహకరించిన వారందరినీ విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

ఇదీ చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. వెలుగులోకి ఎమ్మెల్సీ పాత్ర

Advertisement
Advertisement