పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి

10 Jun, 2021 17:31 IST|Sakshi
నిందితులను అరెస్ట్‌ చేసిన సూరజ్‌పోల్‌ పోలీసులు

జైపూర్‌: మూఢనమ్మకంతో ఒంటెను దారుణంగా హత్య చేశాడో ఓ వ్యక్తి. ఒంటెను చంపేసి తన ఇంటి ముందే గుంతలో పూడ్చిపెట్టాడు. కొన్నాళ్లకు పూడ్చిపెట్టిన ఒంటె తల బయటకు రావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. అయితే అతడి చంపింది రాష్ట్ర జంతువుగా ఉన్న ఉంటెను కావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒంటెను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్‌: నిండు గర్భిణి సహా..)

సూరజ్‌పోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోవర్ధన్‌ విలాస్‌ ప్రాంతంలో రాజేశ్‌ అహిర్‌ డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడికి 24కు పైగా ఆవులు ఉన్నాయి. అయితే డెయిరీలోని ఆక ఆవు అనారోగ్యం పాలైంది. పాలు తక్కువగా ఇస్తుండడంతో ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని అతడికి తెలిసిన వ్యక్తి చేతన్‌ను ఆశ్రయించాడు. చేతన్‌ తన తండ్రి శోభాలాల్‌కు పరిచయం చేశాడు. శోభాలాల్‌ మూఢనమ్మకాలు వదిలిస్తానని మంత్రతంత్రాలు చేస్తుంటాడు. 

ఒంటె తల నరికి ఇంటి వెలుపల పాతిపెడితే సమస్య పరిష్కారమవుతుందని శోభాలాల్‌ రాజేశ్‌ అహీర్‌కు చెప్పాడు. మంత్రగాడు చెప్పినట్టు రాజేశ్‌ ఒంటెను తీసుకువచ్చి తన స్నేహితుల సహాయంతో ఒంటె మెడను నరికి చంపేశాడు. అనంతరం ఒంటె మొండాన్ని ఇంటి ముందు పాతిపెట్టాడు. కొన్ని రోజులకు ఒంటె మొండెం పోలీసులకు చిక్కింది. విచారణ చేపట్టగా ఓ వ్యక్తి రాజేశ్‌ పేరు చెప్పాడు. అనంతరం పోలీసులు రాజేశ్‌ను విచారించగా నేరం అంగీకరించాడు. అక్కడ ఒంటెను చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో రాజేశ్‌తో పాటు అతడి స్నేహితుడు చేతన్‌, అతడి తండ్రి శోభాలాల్‌తో పాటు అతడి స్నేహితుడు మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేశారు. 

మూఢ నమ్మకాలతో ఒంటెను రాజేశ్‌ హత్య చేశాడని సూరజ్‌పోల్‌ పోలీస్‌ అధికారి డాక్టర్‌ హనుమంత్‌ సింగ్‌రాజ్‌ పురోహిత్‌ తెలిపారు. రాష్ట్ర జంతువుగా ఉన్న ఒంటెను హతమార్చడంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. 

చదవండి: రోడ్డుపై టైటానిక్‌ విన్యాసాలు.. వైరల్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు