బైక్‌ను తప్పించాలని లారీని పక్కకు తిప్పటంతో..

29 Mar, 2021 20:31 IST|Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్ద బైక్ నడిపిస్తున్న వ్యక్తిని తప్పించబోయి రెండు లారీలు ఢీకొన్నాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో  లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. వివరాలు.. ఈ సాయంత్రం పీడీఎస్‌ రైస్‌ని తరలిస్తున్న ఓ లారీ గాంధీ నగర్ వద్ద యూటర్న్ తీసుకోబోయింది. ఈ నేపథ్యంలో ఓ బైకు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో లారీ డ్రైవర్‌ బైక్‌పై ఉన్న వ్యక్తిని తప్పించబోయాడు.  వాహనాన్ని పక్కకు తిప్పాడు. లారీ కాస్తా ముందు వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. లారీ క్యాబిన్‌లు నుజ్జనుజ్జయయి డ్రైవర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టోల్ గేట్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు యాక్సిడెంట్ దృశ్యాలు చిత్రీకరించాయి.

మరిన్ని వార్తలు