బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు

16 Oct, 2020 09:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో గురువారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వైపు వస్తున్న కారు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా ప్రమాదానికి కారణం అయిన కారులోని వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దాదాపు రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చదవండి: కలెక్టర్ కారును ఢీ కొట్టిన లారీ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు