బస్సులో ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్య 

13 Mar, 2023 01:25 IST|Sakshi

తొర్రూరు మండల కేంద్రంలో ఘటన

తొర్రూరు: ఆర్టీసీ కండక్టర్‌ బస్సులో ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా తొర్రూ రు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తోన్న మండల పరిధి కంటాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్‌రెడ్డి(54) తొర్రూరు టీచర్స్‌కాలనీలో స్థిరపడ్డాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల మూడు రోజులు సెలవు పెట్టాడు. వాటిని రద్దు చేసుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విధుల్లో చేరేందుకు డిపోకు వచ్చాడు.

సెక్యూరిటీ కార్యాలయం రిజిస్టర్‌లో సంతకం పెట్టి బస్సులోకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వెళ్లి చూడగా బస్సులోని కడ్డీకి ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

మృతునికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే కండక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెబుతున్నారు. 

 

మరిన్ని వార్తలు