13 వాహనాలు ధ్వంసం: ఎస్‌ఐ కుమారుడు సహా ఇద్దరి అరెస్టు  

15 Jun, 2021 14:43 IST|Sakshi

టీ.నగర్‌: తూత్తుకుడిలో 13 వాహనాలను ధ్వంసం చేసిన ఎస్‌ఐ కుమారుడు సహా ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి సిప్కాట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రాజగోపాల్‌నగర్, అన్నై థెరిసానగర్, రాజీవ్‌నగర్, బర్మాకాలనీ, భారతీనగర్, తంతితపాలా కాలనీ, బాలపాండినగర్‌ ప్రాంతాల్లో ఇళ్ల ముందు ఉంచిన కార్లు, వ్యాన్లు, ఆటో ఇతర వాహనాలను మత్తుమందు ముఠా శనివారం రాత్రి ధ్వంసం చేసింది.

ఈ క్రమంలో అన్నానగర్‌లో వాహనాలను ధ్వంసం చేస్తుండగా చూసిన ఎడ్వర్డ్‌ (24) అనే యువకుడిపై ముఠా తీవ్రంగా దాడి చేసింది. ప్రస్తుతం అతను తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సిప్కాట్‌ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపారు. అన్నానగర్‌కు చెందిన భరత్‌కుమార్‌ (25), అజీత్‌కుమార్‌ (23), విఘ్నేష్‌పాండి (24)లను అరెస్టు చేశారు. భరత్‌కుమార్‌ తూత్తుకుడి ఎస్‌ఐ కుమారుడిగా తెలిసింది.  

చదవండి: శివశంకర్‌ బాబా కోసం సీబీసీఐడీ వేట 

మరిన్ని వార్తలు