దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి..

17 Apr, 2021 11:53 IST|Sakshi

విజయనగరం క్రైమ్‌:  వరసకు కుమార్తె అయిన బాలికపై సవతి తండ్రి కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడిన దురాగతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ బాలిక విశాఖ వెళ్లినప్పుడు పక్కింటి పిన్నితో చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో తల్లి ఫిర్యాదుచేసింది. రంగంలోకి దిగి న ‘దిశ’ డీఎస్పీ టి.త్రినాథ్‌ కేసు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. డెంకాడ మండలానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై సవతి తండ్రి కొద్ది నెలలుగా రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

ఇటీవలికాలంలో భార్య, భర్తల మధ్య తగాదా రావడంతో పిల్లలను పట్టు కుని తల్లి విశాఖలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ పక్కనే నివాసముంటున్న మహిళతో బా లిక తన గోడును వెళ్లబోసుకుంది. భర్తతో తగా దా మంచిది కాదని సోదరుడు సర్దిచెప్పడంతో రెండురోజుల కిందటే తిరిగి తన ఇంటికి వచ్చేసింది. ఇంటికివచ్చిన తర్వాత కూడా అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలిక ఫోన్‌లో తన పిన్నికి విషయం చెప్పింది. ఆమె వెంటనే స్పందించి తల్లికి వివరించడంతో ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి:
నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో      
కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు