స్కూల్‌ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి | Sakshi
Sakshi News home page

స్కూల్‌ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి

Published Thu, Feb 3 2022 3:04 PM

Teen Molested Class 11 Students In Gujarat Narmada - Sakshi

అహ్మ‌దాబాద్ : మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడుల ఘ‌ట‌న‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా వారిపై దాడులు తగ్గడం లేదు. కామాంధుల ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. తాజాగా స‌భ్యస‌మాజం త‌లదించుకునే ఘటన గుజ‌రాత్‌లో వెలుగు చూసింది. నర్మదా జిల్లాలోని దేడియాపద పట్టణంలో 11వ తరగతి చదవుతున్న విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్లు లైంగికదాడికి పాల్పడ్డారు.

బాలిక‌ను నిందితులు ఎస్‌టీ డిపో ప్రాంతం నుంచి స్కూల్‌ వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం ఆమెపై స్కూల్ భ‌వ‌నం వెనుక సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఉదంతంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఘ‌ట‌న‌కు సంబంధించి ఆరుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: ఎంత పని చేశావమ్మా..? తొట్టెలో ముంచి బిడ్డలను హత్య చేసిన తల్లి

Advertisement
Advertisement