టీడీపీ శ్రేణుల దాడిలో ఇద్దరికి గాయాలు

5 Feb, 2021 08:52 IST|Sakshi
గాయపడిన వెంకట్రావు, శ్రీనివాసరావు

అర్వపల్లిలో నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా దౌర్జన్యం

నరసరావుపేట రూరల్‌(గుంటూరు జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులను భయాందోళనకు గురిచేసే లక్ష్యంతో గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నరసరావుపేట మండలం అర్వపల్లికి చెందిన సర్పంచి అభ్యర్థి ధర్మవరపు అంజనాకు మద్దతుగా గురువారం యంపరాల వెంకట్రావు, పులుసు శ్రీనివాసరావులు నామినేషన్‌ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మెయిన్‌ రోడ్డుపై వేచి ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని అంజనాకు ఎందుకు మద్దతిస్తున్నారంటూ.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: డబ్బులిస్తాం.. మా వెంట రండహో!)

నామినేషన్‌ వేశాడని 500 మామిడి మొక్కలకు నిప్పు 
రామగిరి: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండల పరిధిలోని పోలేపల్లి  గ్రామానికి చెందిన సిద్ధయ్య గురువారం వార్డు మెంబర్‌గా నామినేషన్‌ వేశాడు. అయితే ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సిద్ధయ్య పొలంలో సాగు చేసిన 550 మొక్కలతో పాటు, వ్యవసాయ సామగ్రికి నిప్పుపెట్టారు. ఘటనలో సమీపంలోని రాము, రాంగోపాల్‌రెడ్డికి చెందిన పొలాల్లోని వ్యవసాయ సామగ్రి, పైపులు కూడా కాలిపోయాయి. రామగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.(చదవండి: ఒక ఊరు.. మూడు పంచాయతీలు!


పోలేపల్లిలో కాలిపోయిన మొక్కలను పరిశీలిస్తున్న పోలీసులు..  

మరిన్ని వార్తలు