Sakshi News home page

పోలీసుల నీచ బుద్ధి.. ఫేస్‌బుక్‌ పరిచయం.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం, ఆపై!

Published Wed, May 3 2023 11:39 AM

Two Policemen Molested Woman Force Her to Abort In UP - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. న్యాయం కోసం వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే నీచానికి పాల్పడ్డారు. చట్టాన్ని కాపాడల్సిన వారే వక్ర బుద్ధి చూపించారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షమ్లీ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. 

వివరాలు.. ఇమ్రాన్‌ మీర్జా అనే వ్యక్తి పిలిభిత్‌ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021 మార్చిలో ఫేస్‌బుక్‌ ద్వారా యువతి పరిచయమైంది. వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం షమ్లీలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని  ఆమెకు వసతి కల్పించాడు. అయితే అక్కడ నివసించే సమయంలో మీర్జా సోదరుడు ఫుర్కాన్(కానిస్టేబుల్‌) కూడా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది.

ఇద్దరు సోదరులైన కానిస్టేబుళ్లు తనను రోజుల తరబడి నిర్భంధంలో ఉంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అంతేగాక రెండుసార్లు గర్భవతి కాగా.. బలవంతంగా అబార్షన్‌ చేయించినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని బయటికి చెప్పేందుకు ప్రయత్నించగా.. ఇమ్రాన్‌ తనను దారుణంగా కొట్టారని తెలిపింది. దీంతో రెండేళ్ల నుంచి వారి అరాచకాలు భరిస్తూ మైనంగా ఉన్నట్లు చెప్పింది.

ఇటీవల కామాంధుడి వేధింపులు ఎక్కువయ్యాయని, తరుచూ తనపై చేయిచేసుకున్నట్లు తెలపింది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని.. కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.. అయితే ఇప్పుడు కూడా కేసును ఉపసంహరించుకోవాలని ఇమ్రా,న్ అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిలిభిత్‌ ఎస్పీ అతుల్‌ శర్మ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్‌ దుర్మరణం.. 

Advertisement
Advertisement