ప్రియుడి కోసం భర్త హత్యకు సుపారీ.. మద్యం తాపించి ఒంటిపై సాస్‌చల్లి

20 Aug, 2022 14:30 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రియుడికోసం భర్త హత్యకు సుపారీ ఇచ్చిన భార్యతో నలుగురిని  శుక్రవారం బెంగుళూరులోని పీణ్యా పోలీసులు అరెస్ట్‌చేశారు. పట్టుబడిన వారిలో దొడ్డబిదరకల్లు నివాసి పల్లవి,  ఆమె తల్లి అమ్మజమ్మ, హరీశ్, ముగిలన్‌ ఉన్నారు. వివరాలు.. నవీన్‌కుమార్‌ అనే వ్యక్తి చొక్కసంద్రలో విల్లింగ్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తూ కారు డ్రైవింగ్‌ కూడా చేస్తున్నారు. దొడ్డబిదరకల్లు ఆహం ఆత్మ పాఠశాల వద్ద ఇంటిని అద్దెకు తీసుకుని భార్య పల్లవి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు.

అయితే పల్లవి హిమవంత్‌కుమార్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించి కొందరికి సుఫారి ఇచ్చింది. తమిళనాడు ట్రిప్‌ ఉందని నవీన్‌కుమార్‌ను తీసుకెళ్లి అపహరించారు. అయితే హత్యచేయడానికి భయపడి నవీన్‌కుమార్‌కు మద్యం తాపించి ఒంటిపై సాస్‌చల్లి హత్య చేసినట్లు నమ్మించి ఫొటో తీసి హిమవంత్‌కుమార్‌కు పంపించారు.

ఇదిలా ఉండగా నవీన్‌కుమార్‌ ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడం, పల్లవి పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో నవీన్‌కుమార్‌ సోదరి వరలక్ష్మీ పీణ్యా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పల్లవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నోరు విప్పింది. పల్లవి, ఆమె తల్లి అమ్మజమ్మ, హరీశ్, ముగిలన్‌ను అరెస్ట్‌  చేశారు. పల్లవి ప్రియుడు ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.      

మరిన్ని వార్తలు