పెళ్లయ్యాక ఆమెతో భర్త ఒక్కరోజు గడపలేదు.. మరో మహిళతో రీల్స్‌..

13 Apr, 2023 09:57 IST|Sakshi

కర్ణాటక: భర్తకు వేరే మహిళతో కలిసి రీల్స్‌ చేయటం ముఖ్యం. మరిదికి ఇంట్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకుని అశ్లీల వీడియోలు చూడడం ముఖ్యం. దీనిని ప్రశ్నించవలసిన అత్తమామలు తనను  వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళ ఒకరు బెంగళూరు తూర్పు విభాగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ప్రమోద్‌ కుమార్, మరిది, అత్త మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. 2022 మే లో ప్రమోద్‌కుమార్‌తో బాధిత మహిళకు పెళ్లయింది.  

రూ.30 లక్షల ఖర్చు చేసి పెళ్లి చేయడంతో పాటు బాగా కట్న కానుకలిచ్చారు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఆమెతో భర్త గడపలేదు. కానీ మరో మహిళతో వీడియోలు చేస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసేవాడు. ఇక మరిది పని ఇంట్లో కూర్చుని నీలి చిత్రాలను చూడడంతో పాటు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. సొంత ఇల్లు ఉందని నమ్మించి, తీరా బాడుగ ఇంటిలో ఉంటూ తనను మోసం చేశారని వాపోయింది. పుట్టింటి నుంచి మరింత డబ్బులు తీసుకురావాలని రాచి రంపాన పెడుతున్నారని తెలిపింది.

మరిన్ని వార్తలు