జీతం అడిగిందని మహిళను చితకబాదిన యజమాని

22 Mar, 2023 17:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై:  ఓ మహిళకు మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకున్నాడు యజమాని. తీరా గట్టిగా అడిగేసరికి విచక్షణ మరచి ఆమెను చితకబాదాడు. ఈ దారుణ ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూణెలో అకుర్దిలోని వాణిజ్య సముదాయంలోని ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ ఆఫీసులో ఓ మహిళ కొంత కాలంగా పని చేస్తోంది. 

అయితే కొన్ని రోజులుగా, అర్షద్ కమల్ ఖాన్‌ తన సోదరుడికి బదులుగా ఆ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలలుగా ఆ మహిళకు జీతాన్ని చెల్లించడం లేదు. చివరికి ఈ విషయమై ఖాన్‌ని గట్టిగా ప్రశ్నించగా విచక్షణారహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె రక్తస్రావం అయింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసుల కేసు అతడి మీద కేసు నమోదు చేశారు. పూణెలోని నిగ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా అర్షద్ కమల్ ఖాన్‌ని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు