ప్రేమించిన యువతితో పెళ్లి చేయలేదని.. పని చేసిన ప్రదేశానికి వెళ్లి..

12 Jun, 2022 11:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,తడ(తిరుపతి): ప్రేమించిన యువతితో కుటుంబ సభ్యులు వివాహం చేయలేదన్న మనస్తాపంతో యువకుడు శుక్రవారం  ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దొరవారిసత్రం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జేపీ శ్రీనివాసరెడ్డి కథనం.. దొరవారిసత్రం మండలం, లింగంపాడు గ్రామానికి చెందిన వల్లంశెట్టి మునినాగయ్య రెండో కుమారుడు పార్థసారథి(25) స్థానికంగా ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తూ తననే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఈ విషయమై తల్లిదండ్రులకు తెలపగా ముందు జీవితంలో స్థిరపడితే పెళ్లి చేస్తామని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. మనస్తాపానికి గురైన పార్థసారథి శుక్రవారం గతంలో తాను పనిచేసిన మరో పరిశ్రమ వెనుకవైపు వెళ్లి కలుపు మందు తాగాడు. అనంతరం తన మిత్రుడు నవీన్‌కి ఫోన్‌ చేసి సమా చారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న నవీన్‌ అపస్మారక స్థితిలో ఉన్న పార్థసారథిని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకి తరలించగా, చికి త్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. శనివారం మృతుని అన్న కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు