సాగుకు సర్కారు అండ | Sakshi
Sakshi News home page

సాగుకు సర్కారు అండ

Published Tue, Nov 7 2023 2:12 AM

ధాన్యం పనలు కుప్పలు వేస్తున్న రైతులు - Sakshi

నేడు ఖాతాల్లో రైతు భరోసా –

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి

జిల్లాలో 1.65 లక్షల మంది అర్హులు

జమ కానున్న రూ.68.03 కోట్లు

ఈ ఏడాది ఇది రెండో విడత

ఖరీఫ్‌ కోతలకు మేలు అంటున్న రైతులు

సాక్షి అమలాపురం: జిల్లాలో ఖరీఫ్‌ కోతలు మొదలయ్యాయి. మరో నెల రోజుల్లో రబీ సాగు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది రెండవ విడత వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేయనుంది. ఖరీఫ్‌ సాగు ఆరంభంలో తొలి విడత సొమ్ము వేసిన ప్రభుత్వం, కోతల సమయంలో రెండవ విడత సొమ్ము వేస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారం వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి రెండవ విడత సొమ్మును రూ.నాలుగు వేల చొప్పున జమ చేయనున్నారు.

ఈ ఏడాది జూన్‌ ఒకటో తేదీన తొలి విడత రైతు భరోసా, పీఎం సమాన్‌ నిధి సొమ్ము రైతుల ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500, పీఎం కిసాన్‌ నిధి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.7,500 రైతుల ఖాతాలో జమ చేశారు. తాజాగా వైఎస్సార్‌ రైతు భరోసా రూ.రెండు వేలు, పీఎం కిసాన్‌ నిధి రూ.2 వేల చొప్పున మొత్తం రూ.నాలుగు వేలు వేయనున్నారు. రెండు విడతల్లో మొత్తం రూ.11,500 రైతుల ఖాతాలో వేసినట్టవుతుంది. ఇక మిగిలిన రూ.రెండు వేల పీఎం కిసాన్‌ నిధి జనవరిలో వేయనున్నారు. ఆ విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధు సొమ్ము రైతులకు రూ.13,500 చొప్పున జమ చేసినట్టు అవుతుంది.

రామచంద్రపురం మండలంలో అత్యధికంగా..

జిల్లాలో జూన్‌ ఒకటో తేదీన తొలి విడత రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధి ద్వారా 1,61,386 మందికి లబ్ధి చేకూరింది. వీరి ఖాతాలలో రూ.121.29 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. రెండవ విడత లబ్ధిదారుల సంఖ్య పెరగడం గమనార్హం. ఈసారి 1,65,382 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. రెండు విడతలు కలిపి రైతులకు ఈ ఏడాది రూ.189.32 కోట్ల లబ్ధి చేకూరింది. జిల్లాలో అత్యధికంగా రామచంద్రపురం మండలంలో 10,050 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక్కడ రూ.4.14 కోట్లు రైతుల ఖాతాలో జమ కానున్నాయి.

● గడచిన నాలుగేళ్లలో జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా సగటున 1,41,696 మంది రైతులకు రూ.765.06 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక ఐదవ ఏటా ఈ ఏడాది రెండు విడతల సొమ్ము కలిపితే రైతులకు అందిన లబ్ధి రూ.954.38 కోట్లు కావడం గమనార్హం.

నియోజకవర్గాల వారీగా ఇలా..

నియోజకవర్గం లబ్ధి పొందే నగదు

రైతులు (రూపాయిలలో)

అమలాపురం 16,556 6,81,02,046

కొత్తపేట 27,986 11,51,19,364

రాజోలు 25,942 10,67,13,965

పి.గన్నవరం 30,189 12,41,84,169

మండపేట 22,369 9,20,15,711

రామచంద్రపురం 19,659 8,08,66,855

ముమ్మిడివరం 22,681 9,32,97,890

అర్హులైన ప్రతి ఒక్కరికీ..

రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధి జిల్లాలో ప్రతి లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహం వల్ల ఖరీఫ్‌, రబీ సాగు పెట్టుబడులలో కొంత వరకు రైతుకు కలిసి వస్తోంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు అధికంగా ప్రయోజనం కలుగుతోంది.

– బోసుబాబు, జిల్లా వ్యవసాయ అధికారి

ఇప్పటి వరకు రూ.61,500

నాకు 2.24 ఎకరాల వరి పొలం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద నా ఖాతాలో ఇప్పటి వరకు రూ.61,500 పడింది. రేపు మరో విడత రూ.4 వేలు పడితే మొత్తం రూ.65,500 పడినట్టు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ రైతు భరోసా సొమ్ము క్రమం తప్పకుండా అందజేశారు. ఈ సొమ్ము మాకు ఖరీఫ్‌ పెట్టుబడికి ఉపయోగపడుతుంది.

– మీసాల గంగాధరరావు, రైతు, గోపాలపురం, రావులపాలెం మండలం

వరుసగా ఐదో ఏట.. 2019-20 2020-21 2021-22 2022-23

చేకూరిన చేకూరిన చేకూరిన చేకూరిన

నియోజకవర్గం లబ్ధిదారులు లబ్ధి (రూ. లబ్ధిదారులు లబ్ధి (రూ. లబ్ధిదారులు లబ్ధి (రూ. లబ్ధిదారులు లబ్ధి (రూ.

కోట్లలో) కోట్లలో) కోట్లలో) కోట్లలో)

అమలాపురం 16,734 225.90 16,734 225.90 17,179 231,91 15,933 215.09

ముమ్మిడివరం 22,962 309.98 22962 309.98 22,962 309.98 22,970 310,09

పి.గన్నవరం 28,563 385.61 28,563 385.60 28,834 389.25 27,388 369.73

రాజోలు 26,005 351.06 26,005 351.06 27,049 365.16 24,637 332.60

కొత్తపేట 29,337 396.05 29,337 396.05 28,790 388.66 26,920 363.42

మండపేట 22,413 302.57 22,413 302.57 21,591 291.47 21,440 289.21

రామచంద్రపురం 19,515 263.45 19,515 263.45 18,742 252.77 18,460 249.21

1/3

2/3

3/3

Advertisement
Advertisement