అమలాపురంలో సినీ షూటింగ్‌ సందడి | Sakshi
Sakshi News home page

అమలాపురంలో సినీ షూటింగ్‌ సందడి

Published Tue, Nov 7 2023 11:52 PM

కోలాహలంగా ఉన్న గడియారం స్తంభం సెంటర్‌  - Sakshi

అమలాపురం టౌన్‌: స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లో గీతా ఆర్ట్స్‌ –2 బేనర్‌పై ఇంకా పేరు పెట్టని చిత్రం షూటింగ్‌ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగింది. బన్నీ వాస్‌ సమర్పణలో అమలాపురానికి చెందిన కంచిపల్లి అంజి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌తో పట్టణ నడి బొడ్డు అయిన గడియారం స్తంభం సెంటర్‌ సందడిగా కనిపించింది. చిత్ర హీరో, జూనియర్‌ ఎన్టీఆర్‌ బావ మరిది నితిన్‌ నార్ని, హీరోయిన్‌ నయన సారిక సంభాషించుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించారు. ఇందుకోసం గడియారం స్తంభం సెంటరులో బస్‌ స్టాప్‌ సెట్టింగ్‌ వేశారు. షూటింగ్‌ను తిలకించేందుకు వచ్చిన జనంతో ఆ సెంటరు కిక్కిరిసిపోయింది. కోనసీమ పరిసర ప్రాంతాల్లో మరి కొద్దిరోజులు షూటింగ్‌ కొనసాగనున్నట్లు చిత్ర యూనిట్‌ ద్వారా తెలిసింది. నాలుగు రోడ్ల కూడలిగా నిత్యం రద్దీగా ఉండే గడియారం స్తంభం సెంటర్‌లో షూటింగ్‌ జరగడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. వాహన చోదకులు అవస్థలకు గురయ్యారు.

Advertisement
Advertisement