నేటి నుంచి సౌత్‌ జోన్‌ కబడ్డీ టోర్నీ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సౌత్‌ జోన్‌ కబడ్డీ టోర్నీ

Published Wed, Nov 8 2023 11:36 PM

సతీష్‌ రెడ్డి  - Sakshi

గండేపల్లి: కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కళాశాలలో సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ (పురుషులు) టోర్నమెంట్‌ గురువారం నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ టోర్నీని రాష్ట్ర మంత్రి ఆర్‌కే రోజా ప్రారంభిస్తారని ఆదిత్య కళాశాల వైస్‌ చైర్మన్‌ నల్లమిల్లి సతీష్‌ రెడ్డి చెప్పారు. ఆయన బుధవారం గండేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల పరిధిలోని 113 వర్సిటీల నుంచి 1,200 మంది క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. ప్రారంభోత్సవానికి స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఏపీ ఉన్నత మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, నన్నయ వర్సిటీ వీసీ కె.పద్మరాజు తదితరులు హాజరవుతారన్నారు.

కొట్లాట కేసులో

ఇరువర్గాలకు జరిమానా

పెదపూడి: కొట్లాట కేసులో ఇరువర్గాలకు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కరకుదురులో 2018 సంవత్సరంలో ఎం.బ్రహ్మాజీ, వైఎస్‌ రావు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీనిపై విచారణ అనంతరం బుధవారం కాకినాడలోని పీజేసీఐ కమ్‌ జేఎఫ్‌సీఎం మేజిస్ట్రేట్‌ వీఎల్‌ఎస్‌.సుందరి తీర్పునిచ్చారు. బ్రహ్మాజీ వర్గానికి రూ.10 వేలు, వైఎస్‌రావు వర్గానికి రూ.15 వేల జరిమాన విధించారు.

Advertisement
Advertisement