పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | Sakshi
Sakshi News home page

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Published Mon, Nov 13 2023 11:38 PM

ప్రమాణ స్వీకారం చేస్తున్న అసోసియేషన్‌ కార్యవర్గం    - Sakshi

రామచంద్రపురం రూరల్‌: కార్తికమాసంలో ‘పంచారామ దర్శిని’ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రామచంద్రపురం డిపో నుంచి నవంబర్‌ 20, 27, డిసెంబర్‌ 4, 11 తేదీలలో కార్తిక సోమవారాల సందర్భంగా భక్తులు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటల్లో మహా శివుణ్ణి ఒకే రోజులో దర్శించుకునేలా ప్రత్యేక బ స్సులు నడుపుతోంది. ఈ బస్సులు ఆయా తేదీ లకు ముందు రోజు అంటే ఆదివారాల్లో నవంబర్‌ 19, 26, డిసెంబర్‌ 3, 10 తేదీల్లో రాత్రి బయలుదేరి, పంచారామ క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి రామచంద్రపురం డిపోకు చేరకుంటాయి.

రిజర్వేషన్‌ సౌలభ్యం

రామచంద్రపురం డిపోతో పాటు రామచంద్రపురం, ద్రాక్షారామ, తాళ్లపొలం, మండపేట, కె.గంగవరం, అంగర, మాచవరం, రాయవరం, అనపర్తి, రామవరం, బిక్కవోలు గ్రామాల్లో ఏపీఎస్‌ ఆర్టీసీ అధీకృత ఏజెంట్ల వద్ద పంచారామాల దర్శనానికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. పంచారామ క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు 39 మంది బృందంగా ఏర్పడి ఆర్టీసీని సంప్రదిస్తే వారి గ్రామం నుంచే బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడుపుతున్నారు. ఆల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో పెద్దలకు రూ.1,125, పిల్లలకు రూ.845 వసూలు చేస్తారు. అదనపు వివరాలకు

99592 25536, 73829 14010, 73829 12083 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో భక్తులకు మంచినీరు, బిస్కెట్లు అందజేస్తున్నట్లు రామచంద్రపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ కొడమంచిలి వెంకటేశ్వర్లు తెలిపారు.

కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా దేవాదుల

అమలాపురం రూరల్‌: కోనసీమ జిల్లా కార్పెంటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా దేవాదుల సూర్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు. బండారులంక గంగాదేవి మురుగులమ్మ ఆలయ ప్రాంగణంలో జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆధ్యాత్మిక గురువులు బల్ల మల్లేశ్వరరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా దంగేటి రామకృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా అప్పారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కొమలి విగ్నేస్‌, కోశాధికారిగా కడియం శ్రీనివాస్‌, ప్రచార కార్యదర్శిపాటి వెంకట్రామయ్య, కార్యవర్గ సభ్యులుగా అంగర జగదీష్‌,వాసంశెట్టి గణేష్‌ స్వామి, కముజు వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement
Advertisement