ఆధ్యాత్మిక గీతం ఆవిష్కరణ | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక గీతం ఆవిష్కరణ

Published Tue, Nov 21 2023 2:48 AM

ఆధ్యాత్మిక గీతాన్ని విడుదల చేస్తున్న
అసిస్టెంట్‌ కమిషనర్‌ సత్యనారాయణ
 - Sakshi

సఖినేటిపల్లి: ంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో కృష్ణ ధర్మ రక్షణ, జై బజరంగ్‌ సంయుక్త ఆధ్వర్యాన 9 బుధవారాలు – స్వామి వరాలు (9 బుధవారాల దీక్ష – ప్రచార యాత్ర) ప్రచారంపై ప్రత్యేక ఆధ్యాత్మిక గీతాన్ని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. స్వామివారి మహాత్మ్యాన్ని వివరించే ఈ గీతాన్ని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ రచించారు. దీనికి సింధూ కె.ప్రసాద్‌ సంగీతాన్ని స్వరపరిచారు. పర్యవేక్షణ కేడీఆర్‌ వహించగా, సహకారం నల్లా సత్యకృష్ణ కిరణ్‌ ప్రసాద్‌ అందించారు. తొలుత గ్రామంలో స్వామివారి చిత్రపటంతో, స్వామివారి నామ నగర సంకీర్తన చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్‌, అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ, కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడు కేడీఆర్‌, రామసేతు భక్త బృందం, జై బజరంగ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement