పేదల గూడుకు ఉపాధి చేదోడు | Sakshi
Sakshi News home page

పేదల గూడుకు ఉపాధి చేదోడు

Published Sat, Dec 2 2023 2:42 AM

- - Sakshi

వేగంగా చెల్లింపు

ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకంలో 90 రోజుల పని దినాలకు మస్తరు వేస్తున్నాం. వారికి ఉపాధి రోజువారీ వేతానాన్ని అందజేస్తున్నాం. ఈ చెల్లింపుల ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా అండగా నిలుస్తోంది.

– వి.మధుసూదనరావు, ప్రాజెక్టు డైరెక్టర్‌,

జిల్లా నీటి యాజమాన్య సంస్థ

ప్రభుత్వ చేయూతతో సొంత ఇల్లు

ప్రభుత్వం అందించిన సహకారంతో నాకు సొంత ఇల్లు కల నెరవేరింది. ప్రతి దశలో ఇవ్వాల్సిన సొమ్ము మా ఖాతాలో వేశారు. దీని వల్లే అనుకున్న సమయానికి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఈ విషయంలో ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.

– పెరవలి కొండమ్మ,

కట్టుంగ, ఆత్రేయపురం మండలం

కోనసీమలో జోరుగా నిర్మాణాలు

90 రోజుల పని కల్పన

ఇంటికి రూ.24 వేలకు పైగా సాయం

వేతనాల రూపంలో

రూ.13.80 కోట్లు ఖర్చు

సాక్షి అమలాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేయూతనిస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకంలో 90 రోజుల పని దినాలకు మస్తరు వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూలి దినాల సొమ్మును లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ సొమ్ము పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తోంది.

లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ

జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ, వ్యక్తిగతంగా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 9,780 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్న నిధులకు అదనంగా ఉపాధి హామీ పథకం ద్వారా కూడా నిధులు అందజేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికీ 90 పనిదినాల చొప్పున కేటాయించి ఇందుకు అయ్యే కూలి ఖర్చును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. 2021–22 నుంచి ఈ ఏడాది వరకు ఆయా ఏడాది ఉన్న పని దినాల సొమ్మును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. 2021–22లో రోజుకు రూ.245 చొప్పున, 2022–23లో రోజుకు రూ.257 చొప్పున, 2023–24 ఏడాది కాలానికి రోజుకు రూ.272 చొప్పున రోజువారీ పనిదినాల సొమ్ము కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలకు మొత్తం నాలుగు దశలో 90 రోజుల పని దినాల కేటాయిస్తున్నారు. దీనిలో పునాది సమయంలో 28 రోజులు, లింటల్‌ ఎత్తుకు 24 రోజులు, రూప్‌ లెవెల్‌కి 10 రోజులు, నిర్మాణం పూర్తయితే మరో 28 రోజులు చొప్పున గుర్తిస్తున్నారు.

15 మండలాలకు మంజూరు

● జిల్లాలో 22 మండలాలకు గాను 15 మండలాల్లో గృహ నిర్మాణాలకు ఉపాధి నిధుల కేటాయింపు జరిగింది. కొత్తపేట, కాట్రేనికోన, అయినవిల్లి, అంబాజీపేట, పి.గన్నవరం, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో కేటాయింపులు చేయలేదు. 15 మండలాలకు గాను ఇప్పటి వరకు 10,737 పనులు మంజూరయ్యాయి. వీటిలో 5,287 పనులు మొదలు కాగా, 3,375 పనులు పూర్తయ్యాయి. ఇంకా 1,912 పనులు వివిధ దశలలో ఉన్నాయి. పూర్తయిన పనులకు సంబంధించి 5,42,623 పని దినాలు కాగా, వీటికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో రూ.13,80,15,653 జమ చేశారు.

● గృహ నిర్మాణ శాఖ ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థకు లబ్ధిదారులు జాబితా అందుతోంది. గ్రామాల వారీగా అందే జాబితాను బట్టి ఉపాధి సిబ్బంది తొలుత అంచనాలు రూపొందిస్తున్నారు. వీరిలో ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి నిర్మాణ దశలను బట్టి సొమ్ము చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఉపాధి చెల్లింపును పరిగణలోకి తీసుకుంటే ఒక్కొక్క లబ్ధిదారునికి 90 పనిదినాలకు గాను రూ.24,480 వరకు లబ్ధి చేకూరుతోంది.

వివరాలు ఇలా..

మండలం కేటాయించిన ప్రారంభించిన పూర్తయిన మొత్తం కేటాయించిన

పనులు పనులు పనులు పని దినాలు నిధులు (రూ.లలో)

ఆలమూరు 283 152 85 17,452 43,45,235

అల్లవరం 289 162 23 10,944 28,25,388

అమలాపురం 561 318 129 26,275 67,24,130

ఆత్రేయపురం 430 148 232 30,202 76,50,950

ఐ.పోలవరం 502 228 175 27,588 70,12,803

కె.గంగవరం 670 325 156 28,987 74,23,784

కపిలేశ్వరపురం 791 319 316 44,281 1,12,44,695

మామిడికుదురు 132 67 53 8,260 20,82,503

మండపేట 2,946 1,781 591 1,22,032 3,11,51,441

ముమ్మిడివరం 273 162 62 16,184 41,61,283

రామచంద్రపురం 1,366 581 483 68,629 1,73,76,503

రావులపాలెం 589 224 263 36,376 91,94,669

రాయవరం 1,081 555 460 61,816 1,56,46,109

రాజోలు 643 236 310 39,073 1,00,23,164

ఉప్పలగుప్తం 181 29 37 4,524 11,52,996

మొత్తం 10,737 5,287 3,375 5,42,623 13,80,15,653

1/3

2/3

3/3

Advertisement
Advertisement