వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తల దృష్టి | Sakshi
Sakshi News home page

వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తల దృష్టి

Published Sat, Dec 16 2023 2:20 AM

ప్రజెంటేషన్‌ ఇస్తున్న ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ 
డైరెక్టర్‌ డాక్టర్‌ వర ప్రసాద్‌  - Sakshi

రాజానగరం: వాతావరణం మార్పులు, ఉష్టోగ్రతల పెరుగుదలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని యూఎస్‌ఐలోని కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ, సస్టైనబుల్‌ ఇంటెన్సిఫికేషన్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీవీ వరప్రసాద్‌ అన్నారు. సుస్థిర వ్యవసాఽభివృద్ధి కోసం భవిష్యత్‌ పంట యాజమాన్యం అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆహార అభద్రత పరిస్థితులను ప్రస్తావించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఐసీఏఆర్‌ (కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ), ఐఎస్‌టీఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ డైరెక్టర్‌, ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ టొబాకో సైన్స్‌ (ఐఎస్‌టీఎస్‌) అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.శేషుమాధవ్‌ పర్యవేక్షణలో అంతర్జాతీయ సదస్సు శుక్రవారం కొనసాగింది. థాయ్‌లాండ్‌కి చెందిన వన్‌ ఇంటర్నేషనల్‌, ఆసియా ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త సిల్వేరియా లియాండ్రో మాట్లాడుతూ భారతదేశం, చైనా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలోని రైతుల జీవనోపాధి మెరుగుదలపై దృష్టి సారిస్తున్నామన్నారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బెంగళూరు) విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్‌ ఈవీవీఎస్‌ ప్రకాశరావు వాణిజ్య వ్యవసాయంలో వైవిధ్యం కోసం ఔషధ, సుగంధ పంటలు, ప్లాంట్‌ పాథాలజీ విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ జె.కృష్ణ ప్రసాద్‌ పసుపు పంట – వినియోగం అనే అంశాలపై ప్రసంగించారు. ఐసీఏఆర్‌ డైరెక్టర్లు ప్రొఫెసర్‌ టీకే మెహెరా, డాక్టర్‌ ఆర్‌.దినేష్‌, డాక్టర్‌ నమితాదాస్‌ సాహా, డాక్టర్‌ సీహెచ్‌వీవీ సత్యనారాయణ, డాక్టర్‌ భీమ్‌ ప్రతాప్‌ సింగ్‌ వివిధ అంశాలపై మాట్లాడారు.

Advertisement
Advertisement