Sakshi News home page

సీఎంగా జగన్‌ను గెలిపించుకోవడమే మా లక్ష్యం

Published Tue, Apr 16 2024 2:35 AM

వలంటీర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు  - Sakshi

స్పష్టం చేసిన వలంటీర్లు

ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ

1200 మంది రాజీనామా

మండపేట: ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించుకోవడమే తమ లక్ష్యమని మాజీ వలంటీర్లు స్పష్టం చేశారు. టీడీపీ నాయకుల తీరును నిరసిస్తూ నియోజకవర్గంలోని 1200 మంది స్వచ్ఛందంగా సోమవారం రాజీనామాలు చేశారు. వీరందరూ మండపేట మెయిన్‌ రోడ్డు బస్టాండ్‌ సమీపంలోని సూర్యా కన్వెన్షన్‌ హాలులో సమావేశం నిర్వహించారు. కపిలేశ్వరపురం, రాయవరం, మండపేట మండలాలు, మండపేట పట్టణంలోని వలంటీర్లందరూ హాజరయ్యారు. ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం జగన్‌కు తామంతా అండగా ఉన్నామంటూ చేతులు పైకెత్తి మద్దతు తెలిపారు. ఈ సభకు శాసనమండలి సభ్యుడు తోట త్రిమూర్తులుతో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పతివాడ దుర్గారాణి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోసం వలంటీర్లందరూ స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారన్నారు. ఇక నుంచి ధైర్యంగా వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ ఐదేళ్లు అనుబంధం ఏర్పర్చుకున్న ప్రజలను కలిసి, జగన్‌ను మళ్లీ సీఎంగా ఆశీర్వదించేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో యువ నాయకులు చోడే సత్యకృష్ణ, తోట ఫృథ్వీరాజ్‌, జెడ్పీటీసీలు పుట్టపూడి అబ్బు, కుడుపూడి భవానీ రాంబాబు, ఎంపీపీలు మేడిశెట్టి సత్యవేణి, నౌడు వెంకటరమణ, వుండమట్ల వాసు, వైస్‌ చైర్మన్‌, పిల్లి గనేశ్వరరావు, పార్టీ కన్వీనర్లు ముమ్మిడివరపు బాపిరాజు, పిల్లా వీరబాబు, బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్లు, సర్పంచ్‌లు బూరిగ ఆశీర్వాదం, గారపాటి సౌజన్య అశోక్‌ కుమార్‌, వరదా చక్రవర్తి, పిల్లా వెంకటలక్ష్మి అరవరాజు. మున్సిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పలివెల సుధాకర్‌, పెంకే గంగాధర్‌, పంపన శ్రీనివాస్‌, యాండ్ర ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement