ఆలయాల అభివృద్ధికి కృషి | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి కృషి

Published Mon, Mar 27 2023 12:40 AM

ఎమ్మెల్సీ జయమంగళను సన్మానిస్తున్న బీసీ సంఘ నాయకులు  
 - Sakshi

ద్వారకాతిరుమల: హిందూ ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర దేవదాయశాఖ ప్రభు త్వ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ అన్నా రు. చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం ఆయ న సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు. స్వామి నివేదనశాలను ఆయన పరిశీలించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో శ్రీకాకుళం జిల్లా నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల స్థితిగతులపై సమీక్షిస్తామన్నారు. పంచాంగకర్తలతో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు. అఖిలభారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు వీఎస్‌ మధుబాబు,బ్రాహ్మణ సంఘ నేత పరిమి సీతారాం, హైందవధర్మ ప్రచార కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోలేటి శ్రీనివాసు, కాశీభట్ల పార్వతీశం తదితరులు ఉన్నారు.

బీసీ పక్షపాతి సీఎం జగన్‌

కై కలూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద మనసుతో బీసీ వర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ కేటాయించారని నియోజకవర్గ బీసీ, ఎస్సీ నాయకులు కొనియాడారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన జయమంగళను ఆటపాకలోని ఆయన నివాసం వద్ద ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర మాల మహానాడు అనుబంధ సంఘాల అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, బ్యాక్‌బోన్‌ వంటి వారిని సీఎం జగన్‌ చెప్పిన మాటను నిజం చేస్తూ జయమంగళకు ఎమ్మెల్సీ కేటాయించారన్నారు. ఎమ్మెల్సీ జయమంగళ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరికీ సేవ చేస్తానన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గంగునేని వరప్రసాద్‌, రాష్ట్ర మాల మహానాడు అనుబంధ సంఘాల అధ్యక్షుడు సేవా నాగ జగన బాబురావు, నాయకులు సయ్యపురాజు గుర్రాజు, పోసిన పాపారావు గౌడ్‌, బూరుబోయిన శ్రీనివాసరావు, గంగుల అశోక్‌, బడుగు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

రైతులకు పరిహారం పెంపు

చింతలపూడి: గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌బాబు చొరవతో అదనపు పరిహారం విడుదలైనట్టు రైతు నాయకులు గిరి భోగారావు ఆదివారం తెలిపారు. గతంలో రైతులకు ఎకరానికి రూ.17 లక్షలు ప్రభుత్వం అందజేసింద న్నారు. లింగగూడెం, రాఘవాపురం, గణిజర్ల, వెంకటాద్రిగూడెం, ఎండపల్లి గ్రామాలకు చెందిన రైతులు పరిహారం పెంచాలని కోరుతూ కోర్టులో కేసు వేశారు. ఈ ఏడాది జనవరిలో ఎకరానికి రూ.3.40 లక్షల అదనపు పరిహారం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 24న 30 మంది ఖాతాలకు రూ.1.33 కోట్లు జమచేశారన్నారు. తమ తరఫున అధికారులతో మాట్లాడి పరిహారం పెంపునకు సహకరించిన ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

భక్తురాలిని సౌకర్యాలపై ఆరా తీస్తున్న దేవదాయశాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీకాంత్‌
1/1

భక్తురాలిని సౌకర్యాలపై ఆరా తీస్తున్న దేవదాయశాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీకాంత్‌

Advertisement
Advertisement