విలువలకు పట్టం.. సందేశాత్మకం | Sakshi
Sakshi News home page

విలువలకు పట్టం.. సందేశాత్మకం

Published Mon, May 1 2023 5:58 AM

ప్రేమతో నాన్న నాటికలో సన్నివేశం   - Sakshi

యలమంచిలి: కొంతేరులోని పులపర్తి వీరాస్వామి యూత్‌ క్లబ్‌ కళామందిర్‌ ఆధ్వర్యంలో 41వ అఖిల భారత స్థాయి నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. ఆదివారం ఆఖరి రోజు ప్రదర్శించిన రెండు నాటికలు విలువలకు పట్టం కట్టాయి. భర్త వికృత చేష్టలు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన కుమార్తెను రక్షించి ఇంటికి తీసుకువచ్చిన తండ్రి, తన బిడ్డకు ధైర్యం చెప్పి అల్లుడిని దారికి తెచ్చే ఇతివృత్తంతో ప్రేమతో నాన్న నాటిక ప్రదర్శించారు. శ్రీ సాయి ఆర్ట్స్‌ (కొలకలూరు) వారు ప్రదర్శించిన నాటికను రావి నాగేశ్వరరావు రచించగా గోపరాజు విజయ్‌ దర్శకత్వం వహించారు. అక్రమ సంబంధం నేరం కాదనే చట్టం ఏ విధంగా సమర్థనీ యమని ప్రశ్నించేలా నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికను ప్రదర్శించారు. తెలుగు కళా సమితి (విశాఖ) వారు నాటికను ప్రదర్శించగా పీటీ మాధన్‌ రచనా సహకారం అందించారు. కృష్ణప్రసాద్‌ దర్శకత్వం వహించారు.

Advertisement
Advertisement