వర్జీనియాకు తీవ్ర నష్టం | Sakshi
Sakshi News home page

వర్జీనియాకు తీవ్ర నష్టం

Published Thu, Dec 7 2023 12:56 AM

వర్జీనియా పొగాకు తోట దెబ్బతిన్న దృశ్యం  - Sakshi

జంగారెడ్డిగూడెం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు రైతు తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. జంగారెడ్డిగూడెం –1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలో సుమారు 75 వేల ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. ఇటీవల నాట్లు పూర్తయ్యాయి. వేసిన నాట్లు ఎదుగుతున్న సమయంలో తుపాను రైతును దెబ్బతీసింది. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల పరిధిలో సుమారు 20 శాతం వర్జీనియా పొలాలు ఇసుకమేటలు వేయడంతో తీవ్ర నష్టం సంభవించింది. గోపాలపురం, దేవరపల్లి, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో కూడా కొంత మేర పొలాలు ఇసుక మేటలు వేశాయి. నాణ్యత కోల్పోయి పంట చేతికి రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క బ్యారన్‌కు ఐదెకరాలు వంతున వర్జీనియా వేయగా, ఇంత వరకు బ్యారన్‌ ఒక్కింటికి రూ. 3లక్షల వరకు పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు.

Advertisement
Advertisement