ఏలూరులో ‘హీరో’ కార్నివాల్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఏలూరులో ‘హీరో’ కార్నివాల్‌ ప్రారంభం

Published Mon, Mar 25 2024 1:05 AM

హీరో కార్నివాల్‌ను ప్రారంభిస్తున్న ఆ సంస్థ ప్రతినిధులు 
 - Sakshi

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు సాయిస్వర్ణ హీరో షోరూం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే మెగా సర్వీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ కార్నివాల్‌ను మేనేజర్‌ విజయ్‌ కన్నన్‌, సర్వీస్‌ మేనేజర్‌ గోపాలకృష్ణ ఆదివారం ప్రారంభించారు. హీరో ఖాతాదారుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ వంతు సాంఘిక బాధ్యతగా హీరో కంపెనీ మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. స్థానిక వన్‌టౌన్‌లోని పేరయ్య కోనేరు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ క్యాంపులో సాధారణ వైద్య పరీక్షలు, కంటి, దంత పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రూ.99కే జనరల్‌ సర్వీస్‌ లేబర్‌ చార్జిగా వసూలు చేస్తూ, స్పేర్‌ పార్ట్‌లపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26 వరకు ఈ కార్నివాల్‌ కొనసాగుతుందని చెప్పారు. వన్‌టౌన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్‌, మేనేజర్లు పి.కృష్ణకిరీటి, కె.కై లాష్‌ సుభాష్‌రావు, సాయి స్వర్ణ హీరో షోరూం ఎండీ డి.సుమన్‌ బాబు, జీఎం ఏవీ సోమేశ్వరావు పాల్గొన్నారు.

ఆక్వా మందుల

దుకాణంలో అగ్ని ప్రమాదం

కైకలూరు: పట్టణంలోని సంత మార్కెట్‌ వద్ద ఉన్న ఎ టూ జెడ్‌ ఆక్వా మందుల దుకాణంలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. బ్లీచింగ్‌ బస్తాల నిల్వ గోడౌన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దుకాణం నిర్వాహకుడు మంగినేని రాజేష్‌ ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక అధికారి క్రాంతికుమార్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. బ్లీచింగ్‌ బస్తాల నుంచి ఘాటైన పొగలు రావడంతో మాస్క్‌లు కట్టుకుని అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. విద్యుత్‌ మీటర్‌ వద్ద షార్టు సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని ఫైర్‌ సిబ్బంది చెప్పారు. ఇదిలా ఉంటే ఆటపాక డిగ్రీ కాలేజీ ఎదురుగా తాటిచెట్టుకు సమీప విద్యుత్‌ వైర్లు కారణంగా మంటలు వ్యాపించాయి. పైర్‌ సిబ్బంది వాటిని అదుపు చేశారు.

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
1/1

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Advertisement
Advertisement