Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు నివేదిక సమర్పిస్తున్న సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌. చిత్రంలో ఎస్పీ రమాదేవి
బదిలీలతో బరితెగింపు

సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్‌ బృందం ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌­కుమార్‌ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్‌ అధి­కా­రుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్‌ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్‌ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్‌ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్‌ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్‌ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్‌ ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్‌సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్‌ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్‌ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్‌ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్‌ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 94 మందికి సెక్షన్‌ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.

AP: SIT submits preliminary report to DGP Harish Kumar Gupta
ఏపీ పోలింగ్‌ ఘటనలు: డీజీపీకి సిట్‌ ప్రాథమిక నివేదిక అందజేత

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) నేటితో ముగియనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు సిట్‌ ఇన్‌చార్జి.. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నివేదికను అందజేశారు. 150 పేజీల ప్రాధమిక నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ నివేదకను డీజీపీ.. ఈసీకి పంపనున్నారు. ​కాగా రాష్ట్రంలో న్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సిట్‌ విచారించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు నాలుగు బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించింది సిట్‌. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్‌ బృందాలు.. హింసాత్మక ఘటనలకు కారణాలను విశ్లేషిస్తూ ప్రాథమిక నివేదిక రూపొందించింది. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్‌ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్‌ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్‌ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్‌ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక​ క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. హింసాత్మక ఘటనలు ముందస్తుగా ఊహించడంలో పోలీస్ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. హింసాత్మక ఘటనల సమయంలో పోలీసుల ఉదాసీనతపైనా నివేదిక అందించింది. నేర స్వభావం కలిగిన వ్యక్తులని పూర్తిస్ధాయిలో బైండోవర్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించింది. ప్లీప్లాన్‌గానే హింసాత్మక ఘటనలు జరిగాయని, కర్రలు, రాళ్లు వంటివి ముందుగానే సిద్దం చేసుకోవడం ద్వారా హింసికు పాల్పడ్డారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్‌ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్‌ ఇన్‌చార్జి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్‌ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Tollywood Celebrities Caught At Bengaluru Rave Party Details
రేవ్‌పార్టీ కేసులో ట్విస్ట్‌

బెంగళూరు, సాక్షి: నగరంలో వెలుగు చూసిన రేవ్‌ పార్టీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పక్కా సమాచారం అందుతోంది. వాళ్ల నుంచి బెంగళూరు నార్కొటిక్స్‌ విభాగం శాంపిల్స్‌ సేకరించగా.. అసలు ఈ రేవ్‌ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు.ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.సదరు జీఆర్‌ ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌‌ కాన్‌కార్డ్‌ సంస్థకు గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్‌ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్‌ చేశారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆ కథనాల్ని ఖండించిన కాకాణిరేవ్‌పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్‌ రేవ్‌ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్‌ ​ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్‌ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు. అయితే హేమ ప్రకటన చేసిన కాసేపటికే పోలీసులు ట్విస్ట్‌ ఇచ్చారు. ఆమె పార్టీలో పాల్గొందంటూ బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రముఖులు సైతంబెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ వంద మందిలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. అయితే వీళ్లలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరగ్గా.. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ల నుంచి శాంపిల్స్‌ సేకరించే పనిలో ఉంది బెంగళూరు నార్కోటిక్స్‌ విభాగం.

Telangana Cabinet Key Decisions On May 20th
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

సాక్షి,హైదరాబాద్‌: ఎన్నికల కమిషన్‌(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఉత్సవాలకు కాంగగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్‌ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్‌ నిర్ణయించింది.అమ్మ ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్‌పై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు.

Pm Modi Shares Interesting Thing About His Clothes
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గుజరాత్‌ సీఎంగా ఉన్నపుడు తాను ధరించే దుస్తుల విషయంలో మాజీ సీఎం ఒకరు తనపై చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్‌సిన్హా చౌధరీ అప్పట్లో ఆరోపించారు. అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న సీఎం కావాలా? అని ప్రజలను అడిగాను. ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’ అని మోదీ పాత స్మృతులను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తాజాగా గుర్తు చేసుకున్నారు.

Google Pay Will Stop Working In US After June 4
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?

ఆన్​లైన్​ పేమెంట్​ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్‌కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్‌ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్‌తో రీప్లేస్ చేసినట్లు సమాచారం.

Big concern for Shivam Dubes form hits rock bottom after Squad announcement
శివ‌మ్ దూబేపై వేటు.. వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో ఫినిష‌ర్‌కు చోటు!

ఐపీఎల్‌-2024 ఫ‌స్ట్‌హాఫ్‌లో అద‌ర‌గొట్టిన చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. స్పిన్న‌ర్లు అద్బుతంగా ఎదుర్కొంటాడ‌ని పేరొందిన దూబే.. ఇప్పుడు అదే స్పిన్ బౌలింగ్ అత‌డి వీక్‌నెస్‌గా మారింది. మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి సీఎస్‌కేకు అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడ‌డంతో ఏకంగా అత‌డికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త జ‌ట్టులో సెల‌క్ట‌ర్లు చోటు ఇచ్చారు. కానీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు ఎంపికైన త‌ర్వాత అత‌డి ఆట‌తీరు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆడుతున్న‌ది నిజంగా దూబేనేనా అన్న‌ట్లు ఉంది. తొలి 9 మ్యాచ్ ల్లో 172.4 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. తొలి 9 మ్యాచ్ ల్లో ఏకంగా 26 సిక్సర్లు బాదిన దూబే.. చివరి 5 మ్యాచ్ ల్లో కేవలం 2 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దూబే 15 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు ముందు శివ‌మ్ దూబే ఫామ్ భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే వ‌ర‌ల్డ్‌కప్ ప్ర‌క‌టించిన జ‌ట్టులో మే 25లోపు మార్పులు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో రిజ‌ర్వ్ జాబితాలో ఉన్న రింకూకు ప్ర‌ధాన జ‌ట్టులోకి ప్ర‌మోట్ చేసి.. మెయిన్ జ‌ట్టులో ఉన్న దూబేకు స్టాండ్‌బై లిస్ట్‌లోకి డిమోట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు అయితే బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

US Hikes Tariff on Chinese EV Full Details
జో బైడెన్ కీలక నిర్ణయం.. చైనా ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనీస్ ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపైన విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మరో మూడు సంవత్సరాలు అమలులో ఉంటాయి. అమెరికాలో చవకైన ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.స్వదేశీ వస్తువుల వినియోగం పెరగటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కొత్త ఆవిష్కరణ ఉత్పత్తి చాలా అవసరం. కాబట్టి అమెరికాలోనే కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని చెబుతున్నారు.2025 నాటికి, సెమీకండక్టర్లపై ట్యాక్ రేటు కూడా 25 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది, నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదలను చూస్తుంది. బ్యాటరీ విడి భాగాల మీద ట్యాక్స్ కూడా 25 శాతానికి పెరుగుతుంది. మొత్తం మీద అమెరికా చైనా వస్తువుల మీద భారీ సుంకాలను విధిస్తూ కీలక ప్రకటనలు చేసింది.

Tollywood Hero Srikanth Clarity On His name Comes In Bangalore Rave Party
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్‌

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ టాలీవుడ్‌ సెలబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో టాలీవుడ్‌ సినీతారలు అలర్ట్‌ అయ్యారు. తాను అలాంటి పార్టీకి వెళ్లలేదంటూ ఇప్పటికే నటి హేమ స్పష్టం చేశారు. మరోవైపు ఆ సినీతారలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పార్టీకి టాలీవుడ్‌ హీరో, నటుడు శ్రీకాంత్‌ హాజరైనట్లు వార్తలొచ్చాయి. దీంతో వీటిపై ఆయన స్పందించారు. రేవ్‌ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. దయచసి తప్పుడు కథనాలను నమ్మవద్దని అభిమానులకు శ్రీకాంత్‌ సూచించారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ..'రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని కాదు. దయచేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి. బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నా. కొన్ని ఛానెల్స్‌లో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లొచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో నాలా ఉండంటంతోనే అలా రాశారేమో. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. అతన్ని చూసి నేను కూడా షాకయ్యా. అచ్చం నాలా ఉన్నాడనిపించింది. నా ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా. దయచేసి అసత్య కథనాలు ఎవరు నమ్మొద్దు' అని అన్నారు. అంతే కాకుండా తాను ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొంత సేపు అక్క‌డి ఉండి వ‌చ్చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దని.. మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అసలు విష‌యం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు.. నాలాగా ఉన్నాడ‌నే పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నా.. నేను ఇంట్లోనే ఉన్నా.. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మొద్దు అని అన్నారు.

Iran President Dies Impact on Oil Prices Gold Rates
ఇరాన్‌ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్‌ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్‌ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement