యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్‌

22 Aug, 2020 16:40 IST|Sakshi

కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్‌ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది.  డైనమైట్‌ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. డైనమైట్‌ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్‌పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్‌ను సృష్టించింది. 

శనివారం యూట్యూబ్‌ ట్రెండింగ్‌ వీడియోలలో డైనమైట్‌ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్‌ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్‌గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ ఘనతను సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు విడుదలైన “బాయ్ విత్ లవ్” 24 గంటల్లో 74.6 మిలియన్ వీక్షణలను పొందింది. దీని గురించి బీటీఎస్‌ సంస్థ వారు మాట్లాడుతూ, ‘ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్‌ పాటను రూపొందించి వారికి కొంత ఆనందాన్ని పంచాలనుకుంటున్నాం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు