గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్ లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు సూపర్ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో 14 ఎడిషన్‌లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు సృజనాత్మకతతో ఆసక్తికరంగా నిలిచాయి.
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు ♦ కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు ♦ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు ♦ శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్బ్లేజర్ విభాగంలో అవార్డు ♦ బ్రేక్‌త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు ♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్ ): దిశా పటాని ♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్): బాబీ డియోల్ ♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే ♦ స్టైల్ : కరణ్ జోహార్ ♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది ♦ బెస్ట్ డ్రెస్ తానియా ష్రాఫ్