చందమామ రావే... రోలర్‌ కోస్టర్‌ తేవే! రూపాయి ఖర్చు లేకుండా! | Sakshi
Sakshi News home page

చందమామ రావే... రోలర్‌ కోస్టర్‌ తేవే! రూపాయి ఖర్చు లేకుండా పిల్లలను నవ్వించండి

Published Sun, Apr 16 2023 1:06 AM

Baby Rides Virtual Roller Coaster - Sakshi

పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులకు ఆస్తులు ఏం ఉంటాయి? ఈ ఇన్‌స్టాగ్రామ్‌ వైరల్‌ వీడియోను చూస్తే... ‘నిజమే సుమీ!’ అనిపిస్తుంది. పిల్లలు ఎంజాయ్‌ చేసే వాటిలో రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ కూడా ఒకటి. అయితే బయటికి పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఆనందంలో భాగం చేయడానికి టైమ్‌ సరిపోవడంతో పాటు డబ్బులు కూడా సరిపోవాలి.

ఈ వైరల్‌ వీడియో దంపతులు తమ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్‌ఈడీ టీవీతో ‘రోలర్‌ కోస్టర్‌ రైడ్‌’ను ఇంట్లోకి తీసుకువచ్చారు. సాఫ్ట్‌ కుషన్‌తో కూడిన టబ్‌లో పాపను కూర్చోబెట్టారు. చెరో పక్క పట్టుకొని టీవీ దగ్గరకు తీసుకువెళ్లారు. టీవీలో రోలర్‌ కోస్టర్‌ వర్చువల్‌ వీడియోను ప్లే చేశారు. పాప ఆ రైడ్‌లో భాగం అయింది. సంతోషంతో నవ్వుతూనే ఉంది!

Advertisement
Advertisement