Sakshi News home page

నోరూరించే చికెన్‌ బ్రెడ్‌ పాకెట్స్‌ తయారీ ఇలా!

Published Wed, Mar 30 2022 3:56 PM

Chicken Bread Pockets Recipe In Telugu - Sakshi

చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగించేవాళ్లూ చాలా మందే ఉంటారు. రొటీన్‌గా చికెన్‌ కర్రీ, బిర్యానీ, కబాబ్‌ వంటివి కాకుండా కొత్త రుచులు కూడా కోరుకుంటారు చికెన్‌ ప్రియులు. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ. ఎంచక్కా ఇంట్లోనే ఇలా చికెన్‌ బ్రెడ్‌ పాకెట్స్‌ తయారు చేసుకోండి.

కావలసినవి:  బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు – 7 లేదా 8 (పలుచగా, చిన్నగా కట్‌ చేసుకోవాలి), బ్రెడ్‌ స్లైసెస్‌ – చికెన్‌ ముక్కలతో సమంగా (నలువైపులా బ్రౌన్‌ కలర్‌ ముక్కను తొలగించి, పక్కన పెట్టుకోవాలి),  కారం, మసాలా, ఉప్పు – తగినంత, పసుపు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా, స్వీట్‌ కార్న్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (నిమ్మరసం, ధనియాలపొడి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, చాట్‌ మసాలా కొద్దికొద్దిగా జోడించి, మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి), పెరుగు, చీజ్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్ల చొప్పున, నూనె – సరిపడా

తయారీ: ముందుగా చికెన్‌ ముక్కల్ని ఒక బౌల్‌లో వేసుకుని.. అందులో కారం, మసాలా, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, పెరుగు వేసుకుని బాగా కలిపి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం ఇరువైపులా నాన్‌స్టిక్‌ మీద గ్రిల్‌ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక్కో చికెన్‌ ముక్క ఒక్కో బ్రెడ్‌స్లైస్‌కి ఒకవైపు పెట్టుకుని.. పైన చీజ్‌ తురుము, స్వీట్‌ కార్న్‌ మిశ్రమం పెట్టుకుని ఫోల్డ్‌ చేసుకోవాలి. మూడువైపులా తడి వేళ్లతో నొక్కి ఓపెన్‌ కాకుండా చూసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సాస్‌లో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. 

చదవండి: Summer Tips: వేసవిలో విజృంభించే కామెర్లు, అతిసార.. ఈ ‘పానీయం’ తాగారంటే!

Advertisement
Advertisement