Digital Beggar: Beggar Using Technology Begging With QR Code - Sakshi
Sakshi News home page

Digital Beggar: ఏం తెలివి సామీ.. క్యూఆర్‌ కోడ్‌తో భిక్షాటన చేస్తున్న మోడ్రన్‌ బిక్షగాడు

Published Thu, Jul 6 2023 1:27 PM

Digital Beggar: Beggar Using Technology Begging With QR Code - Sakshi

మనం ప్రతిరోజూ రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, దేవాలయాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద బిచ్చగాళ్లను చూస్తుంటాం. కొందరు తమకు తోచినంత సాయం చేస్తారు. ఇంకొందరేమో చిల్లర లేదని సింపుల్‌గా చెప్పి తప్పించుకుంటుంటారు. అయితే ఈ బిచ్చగాడి నుంచి మాత్రం మీరు అస్సలు తప్పించుకోలేరు. ఇందుకంటే ఇతను టెక్నాలజీని వాడుకుంటూ చేతిలో క్యూఆర్‌ కోడ్‌తో భిక్షాటన చేస్తూ చాలా స్టైల్‌గా అడుక్కుంటున్నాడు.

సాధరణంగా యచకులు పాత సంచి లేదా ఏదైనా చిన్న బొచ్చులాంటి పాత్ర పట్టుకొని అడ్డుకోవడం చూశాం. కానీ ఇది డిజిటల్‌ యుగం కదా. కాలం మారడంతో మనమూ మారాలి అనుకున్నాడేమో ఏకంగా ఇలా క్యూఆర్‌ కోడ్‌ ఇచ్చి మరీ దానం చేయమని అడుక్కుంటున్నాడు. ముంబైలోని ఓ రద్దీ లోకల్‌ ట్రైన్‌లో కనిపించింది ఈ దృశ్యం. చక్కగా పాటలు పాడుతూ స్టైల్‌లో క్యూఆర్‌ కోడ్‌ ఇచ్చి భిక్షాటన చేయడంతో అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టారు.

ఓ వ్యక్తి ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ డిజిటల్‌ భిక్షగాడి తెలివికి నెటిజన్లు షాకవుతున్నారు. మరికొందరేమో ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు సొంతంగా ఉద్యోగం చేస్తూ బతకొచ్చు కదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement
Advertisement