పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి! | Sakshi
Sakshi News home page

పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!

Published Mon, Aug 14 2023 11:30 AM

Do This To Keep Your Lips Looking Healthy And Beautiful! - Sakshi

ఏ సమస్యనైనా దాచడం సాధ్యమేమోగానీ... పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటకు కనిపిస్తాయి. దాంతో అనారోగ్యం బయటపడటంతో పాటు అందం కూడా తగ్గుతుంది. ఫలితంగా సెల్ఫ్‌ ఎస్టీమ్‌ కూడా తగ్గుతుంది. అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... 

పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... 

  • అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
  • సిగరెట్లు తాగేవారిలో పెదవులు నల్లగా, బండగా మారవచ్చు. అందుకే స్మోకింగ్‌ అలవాటును వెంటనే మానేయాలి మహిళల్లో లిప్‌స్టిక్‌ వాడేవారు వాటి కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రొపైల్‌ గ్యాలేట్‌ అనే రసాయన పదార్థం ఉంటుంది. దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తుంటాయి. లిప్‌స్టిక్‌ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని తొలుత పరిశీలించుకుని, తమకు సరిపడుతుందని తేలిన తర్వాతే వాడటం మంచిది నిద్రకు ఉపక్రమించే ముందు లిప్‌స్టిస్‌ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టైమ్‌లో పెదవులపై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె రాసుకోవచ్చు
  • కొన్ని టూత్‌పేస్ట్‌ల వల్ల కూడా మనకు పెదవులపై దురద రావచ్చు. అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయాలి
  • నీరు ఎక్కువగా తాగుతుండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడపకూడదు. 

(చదవండి: మచ్చలు లేని ముఖ సౌందర్యం కోసం..బీట్‌రూట్‌తో ఇలా ట్రై చేయండి!)

Advertisement

తప్పక చదవండి

Advertisement