కాల్చిన మునక్కాయల కూర | Sakshi
Sakshi News home page

కాల్చిన మునక్కాయల కూర

Published Sun, Apr 14 2024 6:22 AM

Drumstick Fry in Unique Method By Grandma In our village - Sakshi

మునక్కాయలను ఇష్టపడని వారు  ముల్లోకాల్లో వెదికినా దొరకరు. సాంబారులో ఎన్ని కూరగాయలు వేసినా మునగ వేస్తేనే గౌరవం. మునగను రకరకాలుగా వండటం చూశాం. కాని పల్లె వంటల్లో ప్రసిద్ధం అయిన ఈశ్వరి అవ్వ మునక్కాయలను కాల్చి చేసిన కూరను అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతున్నారు.

తమిళనాడుకు చెందిన ఈశ్వరి అవ్వకు ‘కంట్రీ ఫుడ్‌ కుకింగ్‌’ అనే యూ ట్యూబ్‌ చానల్‌ ఉంది. సబ్‌స్క్రయిబర్స్‌ ఎంతమందో తెలుసా? పది లక్షల మంది. తమిళనాడు గ్రామీణ వంటలను ప్రయోగ వంటలను అద్భుతంగా చేయడంతో ఈశ్వరి అవ్వకు విపరీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. పచ్చి బొ΄్పాయి పచ్చడి, ఆరిటాకుల హల్వా ఇలాంటి వాటితో ΄ాటు నల్ల మాంసం కూర, అరటికాయతో వెజ్‌ ఫిష్‌ ఫ్రై లాంటివి నోరూరిస్తాయి.

తాజాగా అవ్వ కాల్చిన మునక్కాయల కూర చేసి నెటిజెన్ల మెచ్చుకోలు పొందింది. మునక్కాడలను మంట మీద కాల్చి వాటిని కడిగి, చీరి, లోపల గుజ్జును వొలిచి పక్కన పెట్టుకుందామె. తర్వాత చట్టిలో నూనె ΄ోసి జిలుకర, వెల్లుల్లి, టొమాటో, ఉల్లి΄ాయలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి, ఆఖరున మునగగుజ్జును వేసి దోరగా వేయిస్తే మంచి ఫ్రై కూరలా తయారయ్యింది. దానిని తెల్లన్నంతో తింటూ మనకు వీడియో కనిపిస్తుంది అవ్వ. ఈ రెసిపీని చూసి నెటిజన్లు చాలా కొత్తగా ఉందంటున్నారు. మేమూ ట్రై చేస్తామని బజారుకు మునక్కాయల కోసం వెళుతున్నారు.

Advertisement
Advertisement