ఈస్టర్‌ దీవి మిస్టరీ! | Sakshi
Sakshi News home page

ఈస్టర్‌ దీవి మిస్టరీ!

Published Sun, Apr 9 2023 8:30 AM

Easter Island Mystery - Sakshi

పసిఫిక్‌ సముద్రం ఆగ్నేయప్రాంతంలోని చిట్టచివరి దీవి ఈస్టర్‌ దీవి. ప్రస్తుతం చిలీ అధీనంలో ఉన్న ఈ దీవిలో మానవుల తలలను పోలి ఉండే అత్యంత పురాతనమైన శిల్పాలు కనిపిస్తాయి. ఈ దీవిలో ఇలాంటి శిల్పాలు దాదాపు వెయ్యి వరకు కనిపిస్తాయి. ఇవి దాదాపు వెయ్యేళ్ల కిందటివని, తొలినాళ్లలో ఇక్కడ నివాసం ఉండే ‘రాపా నుయి’ తెగకు చెందిన ప్రజలే ఈ శిల్పాలను చెక్కి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. అంతకు మించి వీటిని ఎవరు ఎందుకు చెక్కి ఉంటారో తెలిపేందుకు మరే ఆధారాలు లేవు.

శిలలపై చెక్కిన ఈ మానవ శిరస్సుల వెనుకనున్న కథ ఏమిటో ఇప్పటికీ మిస్టరీనే! ఈ దీవిలో యూరోపియన్లు 1722లో తొలిసారిగా అడుగుపెట్టే నాటికి ఇక్కడ రెండువేల మందికి పైగా స్థానిక తెగల వారు ఉండేవారు. దండయాత్రలు, వ్యాధుల కారణంగా ఇక్కడి జనాభా 1877 నాటికి 111కు పడిపోయింది. చిలీ ఈ దీవిని 1888లో స్వాధీనం చేసుకున్నాక, ఇక్కడి పరిస్థితులు స్వల్పంగా మారాయి. ప్రస్తుతం ఈ దీవి జనాభా దాదాపు ఎనిమిదివేలు. యునెస్కో ఈ దీవిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 1995లో గుర్తించింది. అప్పటి నుంచి ఇక్కడకు పర్యాటకుల రాక మొదలైంది.

Advertisement
Advertisement