ఎంత రుద్దినా ఉల్లి వాసన పోవడం లేదా? ఇలా చేయండి | Sakshi
Sakshi News home page

Tips: ఎంత రుద్దినా ఉల్లి వాసన పోవడం లేదా? ఇలా చేయండి

Published Thu, Dec 7 2023 11:24 AM

Easy Trick To Get Rid Of Onion Smell On Hands - Sakshi

ఇంటిప్స్‌:

రెండు టేబుల్‌ స్పూన్ల కర్బూజా గుజ్జులో టీస్పూను నిమ్మరసం, టేబుల్‌ స్పూను శనగ పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్‌ తొలగి చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. 

కెచప్‌లో కొద్దిగా అయోడిన్‌ వేసి కలపాలి. అయోడిన్‌ వేసిన తరువాత కెచప్‌ రంగు మారితే  పాడైపోయినట్టు. అంతేగాక ఇతర రసాయనాలు కలిసిన కల్తీ కెచప్‌ మాత్రమే ఇలా రంగు మారుతుంది.

చీజ్‌ ముక్కను మంట దగ్గర పెట్టినప్పుడు మండితే చీజ్‌ నకిలీది. ఇలా కాకుండా నిప్పు సెగకు చీజ్‌ కరిగితే స్వచ్ఛంగా ఉన్నట్టు.

నిమ్మకాయలను ముప్పైసెకన్ల పాటు మైక్రోవేవ్‌లో పెట్టి, ఆ తరువాత  పిండితే రసం బాగా వస్తుంది.

కేక్‌ మిగిలిపోయినప్పుడు అంచులకిరువైపులా బ్రెడ్‌స్లైసులను పెట్టాలి. స్లైసులు పడిపోకుండా టూత్‌ పిక్‌ గుచ్చి, రిఫ్రిజిరేటర్‌లో పెడితే కేక్‌ పాడవకుండా తాజాగా ఉంటుంది.

బ్రెడ్‌ లేదా బిస్కెట్స్‌ను పాలల్లో ముంచుకుని తినేటప్పుడు...చేతితో కాకుండా... ఫోర్క్‌తో పట్టుకుని ముంచితే పాలల్లో చక్కగా మునిగి మరింత రుచిగా ఉంటాయి.

బాస్కెట్‌లో అడుగున కొన్ని పేపర్‌ ముక్కలు వేసి బంగాళదుంపలు వేయాలి. దుంపలపైన మరికొన్ని పేపర్‌ ముక్కలు వేసి నిల్వచేస్తే ΄ాడవకుండా తాజాగా ఉంటాయి. 

మిగిలిపోయిన నిమ్మచెక్కలకు ఉప్పు అద్ది ఉంచితే పాడవకుండా తాజాగా ఉంటాయి.

మిగిలిపోయిన బ్రెడ్‌ ప్యాకెట్‌ను  క్లాత్‌ బ్యాగ్‌లో ఉంచితే బూజు పట్టకుండా తాజాగా ఉంటుంది.

ఉల్లిపాయను ముక్కలు తరిగిన తరువాత చేతులు ఉల్లి వాసన వస్తుంటే... కొద్దిగా టూత్‌ పేస్టుని తీసుకుని దానితో చేతులను రుద్ది కడగాలి. ఇలాచేస్తే ఉల్లిఘాటు వదిలిపోతుంది.

పేపర్‌ బ్యాగ్‌కు రంధ్రాలు చేసి లోపల వెల్లుల్లిని పెడితే నెలల పాటు నిల్వ ఉంటుంది. 

Advertisement
Advertisement