Sakshi News home page

కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ..70 ఏళ్ల తండ్రి ఏకంగా 14 కిలోమీటర్లు..

Published Wed, Jan 17 2024 6:47 AM

Father Pongal Gift To Daughter Travel On Bicycle For 14 Kilometres - Sakshi

దేశమంతా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఒక్కోచోటు ఒక్కో తీరులో వేడుకలు అంబరాన్ని అంటేలా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా కూతూరికి అల్లుడికి బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం వంటివి చేస్తారు. అలానే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ తండ్రి కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఎంత పెద్ద సాహసం చేశాడో వింటే షాకవ్వుతారు. అక్కడ చెరుకు గడలతో పాయసం వండుతారు. అందుకని 70 ఏళ్ల వయసులో ఉన్న ఈ తండ్రి 14 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి మరీ సంక్రాతి కానుక అందించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకెళ్తే..తమిళనాడు రాష్ట్రం పుదు కొట్టై ప్రాంతానికి చెందిన చెల్లాదురై వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడి కూతురు పేరు సుందర పాల్. ఈమెకు 2006లో వివాహం జరిగింది. వివాహం జరిగి 10 సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. 2016లో ఆమె గర్భం దాల్చింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచి చెల్లదురై ఆనందానికి అవధులు లేవు. అప్పటినుంచి తన కూతురి ఇంటికి ప్రతి సంక్రాంతికి చెల్లాదురై వెళ్లి..ఆమెకు, ఆమె పిల్లలకు ఏదో ఒక కానుక ఇచ్చి వస్తుంటారు. అక్కడ సంక్రాంతి పండుగను భారీగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా కొత్త పంటలు ఇంటికి రావడంతో అక్కడ చెరకు గడలతో పాయసం వండుకోవడం అనేది ఆచారం. అయితే ఈ సంక్రాంతికి తన కూతురు, మనవరాళ్ల కోసం చెల్లాదురై సాహసం చేశారు. 

పుదుకొట్టై ప్రాంతంలో ఉంటున్న తన కూతురి కోసం చెరుకు గడల గుత్తిని తలపై పెట్టుకుని 14 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆమె ఇంటికి వెళ్లారు. చెరుకు గడలు ఆమెకు ఇచ్చారు. మనవరాళ్లకు కొత్త దుస్తులు కొనిచ్చారు. అయితే ఇలా చెల్లాదురై తలపై చెరుకు గడలు పెట్టుకొని సైకిల్ తొక్కుతున్న వీడియోను ఓ యువకుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. 

(చదవండి: శాండ్‌విచ్‌ బ్యాగ్‌ ధర వింటే షాకవ్వడం ఖాయం!)

Advertisement

తప్పక చదవండి

Advertisement