పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృ‍త్యువాత | Sakshi
Sakshi News home page

పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృ‍త్యువాత

Published Wed, Apr 10 2024 12:12 PM

five people died Family After Jumping Into Abandoned Well To Save Cat In Ahmednagar - Sakshi

బావిలో పడిన పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని  అహ్మద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

బయోగ్యాస్ పిట్‌లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన కలకలం రేపింది.  పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. మొత్తం ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు దూకారు. అయితే ఊపిరాడక చనిపోయిన ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్‌నగర్‌లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు.

బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు.  ఈ ఘటనపై  విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. చిన్న కుమారుడు విజయ్   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటంలేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ, అందుకే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు విమర్శించినట్టు తెలుస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement