Gaming: యాక్షన్‌–రోల్‌ ప్లేయింగ్‌ గేమ్‌.. 'హరైజన్‌ ఫర్‌బిడెన్‌ వెస్ట్‌' | Sakshi
Sakshi News home page

Gaming: యాక్షన్‌–రోల్‌ ప్లేయింగ్‌ గేమ్‌.. 'హరైజన్‌ ఫర్‌బిడెన్‌ వెస్ట్‌'

Published Fri, Mar 22 2024 8:05 AM

Gaming: Action Role Playing Game Horizon Forbidden West - Sakshi

హరైజన్‌ జీరో డాన్‌ (2017) గేమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన యాక్షన్‌–రోల్‌ ప్లేయింగ్‌ గేమ్‌  హరైజన్‌ ఫర్‌బిడెన్‌ వెస్ట్‌(పీసీ) విడుదలైంది. థర్డ్‌–పర్సన్‌ పర్‌స్పెక్టివ్‌లో ఆడే గేమ్‌ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్‌’ అనే హంటర్‌ను ప్లేయర్‌ కంట్రోల్‌ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్‌ హంటర్‌ అలోయ్‌ శాస్త్రవేత్త ఎలిజబెత్‌ సోటెక్‌ క్లోన్‌.

‘మిస్టీరియస్‌ ప్లేగ్‌’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్‌బిడెన్‌ వెస్ట్‌ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్‌ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్‌ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్‌తో ΄ోల్చితే ఈ గేమ్‌ మ్యాప్‌ పెద్దగా ఉంటుంది. షీల్డ్‌వింగ్, ఫోకస్‌ స్కానర్, డైవింగ్‌ మాస్క్, పుల్‌కాస్టర్‌లాంటి టూల్స్‌ను కంబాట్‌లో ఉపయోగించవచ్చు.

  • ప్లాట్‌ఫామ్స్‌: ప్లే స్టేషన్‌ 4, ప్లే స్టేషన్‌ 5
  • విండోస్‌ జానర్‌: యాక్షన్, అడ్వెంచర్‌
  • మోడ్‌: సింగిల్‌–ప్లేయర్

ఇవి చదవండి: Sia Godika: 'సోల్‌ వారియర్స్‌'.. తను ఒక చేంజ్‌మేకర్‌!

Advertisement
Advertisement