'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్‌ ట్రై చేయండి! | Sakshi
Sakshi News home page

'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్‌ ట్రై చేయండి!

Published Fri, May 3 2024 7:42 AM

Gaming: Adventure Simulation Endless Ocean Luminous New Game

సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్‌ మీ కోసమే.

అడ్వెంచర్‌ సిమ్యూలెషన్‌ గేమ్‌ ‘ఎండ్‌లెస్‌ ఒషియన్‌ లుమినస్‌’ విడుదలైంది. జపాన్‌ గేమింగ్‌ కంపెనీ ‘అరిక’ డెవలప్‌ చేసిన గేమ్‌ ఇది. ‘ఎండ్‌లెస్‌ ఓషన్‌’ సిరీస్‌లో వస్తున్న థర్డ్‌ గేమ్‌. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్‌ చేయడానికి ఈ గేమ్‌లో ప్లేయర్‌ స్కూబా డైవర్‌ పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ప్లాట్‌ఫామ్‌: నిన్‌టెండో స్విచ్‌,
జానర్స్‌: అడ్వెంచర్, సిమ్యులేషన్‌,
మోడ్స్‌: సింగిల్‌–ప్లేయర్, మల్టీ ప్లేయర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement