Sakshi News home page

మీరెప్పుడైనా బ్రెడ్‌ని కీమా చేస్తూ రెసిపీ చేశారా..!

Published Sun, Mar 10 2024 2:14 PM

Have You Ever Heard About Bread Keema Balls. Here Is The Recipe - Sakshi

కావలసినవి:
బ్రెడ్‌ స్లైస్‌ – 15 లేదా 20 (నలువైపులా కట్‌ చేసి.. పాలలో ఒకసారి ముంచి.. చేతులతో గట్టిగా ఒత్తుకుని, విడిపోకుండా చపాతీకర్రతో చపాతీల్లా ఒత్తుకుని పక్కనపెట్టుకోవాలి)
మటన్‌ కీమా – పావు కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని ఉడికించుకుని, చల్లారనివ్వాలి)
బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించి, ముద్దలా చేసుకోవాలి)
వాము పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, గరంమసాలా, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్‌ – అర టీ స్పూన్‌ చొప్పున, పుదీనా తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – తగినంత, బ్రెడ్‌ పౌడర్‌ – 3 టేబుల్‌ స్పూన్లపైనే
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉడికిన కీమా, జీలకర్రపొడి, గరం మసాలా, వాము పొడి, ఆమ్‌చూర్‌ పొడి, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తరుగు, బంగాళదుంప గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. అనంతరం చిన్నచిన్నబాల్స్‌లా చేసుకుని ఒక్కో బ్రెడ్‌ ముక్కలో ఒక్కో ఉండ పెట్టి.. గుండ్రంగా బాల్స్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ ఉండలను పాలల్లో ముంచి, బ్రెడ్‌ పౌడర్‌ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. నచ్చిన కూరగాయల తురుముతో సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బాల్స్‌.

ఇవి చదవండి: ఆలూ కేక్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా..!

Advertisement

What’s your opinion

Advertisement