హెల్త్‌కేర్‌...యాప్‌ హుషార్‌ | Sakshi
Sakshi News home page

Healthcare Apps: హెల్త్‌కేర్‌...యాప్‌ హుషార్‌

Published Sat, Sep 18 2021 7:10 PM

Healthcare Apps Have Changed the Medical Industry - Sakshi

ఒకప్పుడు అరచేయి చూస్తే చాలు ఆరోగ్యం గురించి చెప్పేసేవారట. ఇప్పుడు అరచేయిలో ఇమిడిపోయే మొబైల్‌ ఫోన్‌  చూసి ఆరోగ్య చరిత్ర చెప్పేస్తున్నారు. వ్యక్తికి సంబంధించిన శారీరక, మానసిక ఆరోగ్య విశేషాలు, వ్యాధులు, చికిత్సల చరిత్ర, వ్యాక్సినేషన్, చేయించుకున్న శస్త్రచికిత్సలు,వాడిన/వాడుతున్న మందులు.. వంటివన్నీ ఒకే చోట అందించే యాప్స్‌కు ఇప్పుడు అమాంతం డిమాండ్‌ పెరిగిపోయింది. కరోనా తర్వాత వ్యక్తిగత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ హెల్త్‌కేర్‌ యాప్స్‌ వెల్లువకు కారణమైంది. 
చదవండి: పది కోట్ల ప్రైజ్​మనీ రేసులో మన బిడ్డ

     ప్రతి వ్యక్తి తనకు తానే ఆరోగ్య వ్యవస్థను  నిర్వహించుకునే అవకాశాన్ని ఈ యాప్స్‌ ఇస్తున్నాయి.  ఉన్న చోట నుంచి కదలకుండా అందించే టెలి మెడిసిన్‌   ఆరోగ్య సంరక్షణ విషయంలో చికిత్స మాత్రమే కాకుండా వ్యాధులు రాకుండా నివారణకు కూడా వీలు కల్పిస్తాయి.  సమగ్రమైన నిర్వహణ ఉపకరణంగా డాక్టర్లు / రోగుల నడుమ వారధిగా హెల్త్‌కేర్‌ యాప్‌ నిలుస్తుంది.  ఈ యాప్‌ ఆండ్రాయిడ్, వెబ్‌ పోర్టల్, ఐఓఎస్‌ల ద్వారా లభ్యమవుతుంది. 

‘‘ప్రస్తుతం, ఆరోగ్యరంగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది.  హెల్త్‌కేర్‌ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు పుంజుకుంటున్నాయి. .  మారిన వాతావరణంలో  రోగులు, డాక్టర్ల నడుమ అంతరాలను పూరించే ఉపకరణాల అవసరం బాగా పెరిగింది.  వ్యాధులకు చికిత్సలను అందుకోవడంలో రోగుల వెతలను తగ్గించాలనే లక్ష్యంతో విడుదలవుతున్న నూతన యాప్స్‌ మెరుగైన ఫలితాలను పొందడంలో రోగులకు సహాయపడతాయి. ఒకే యాప్‌తో మొత్తం కుటుం ఆరోగ్యాన్ని కూడా నిర్వహించవచ్చు’’అని ఇటీవలే ఈ తరహా యాప్‌ను విడుదల చేసిన డిజిటల్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ హీల్ఫా సిఇఒ రాజ్‌ జనపరెడ్డి అభిప్రాయపడ్డారు. 

    ‘‘ఈ యాప్‌ పై రోగికి సంబంధించిన ఆరోగ్య రికార్డులన్నీ ఒక్క క్లిక్‌లో డాక్టర్‌తో పాటుగా రోగికి సైతం లభ్యమవుతాయి. అంతేకాదు డిజిటల్‌ చెల్లింపులకు సైతం సహకరిస్తుంది.   టెలి కన్సల్టేషన్‌తో రోగులు ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచైనా డాక్టర్లను సంప్రదించవచ్చు’’నని చెప్పారాయన.
చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!

Advertisement
Advertisement